ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2020-05-28T22:14:43+05:30

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కర్మాగారంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ హహకారాలు చేశారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కర్మాగారంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ హహకారాలు చేశారు. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. 

నగరంలోని బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా గాంధీనగర్‌లోని యాష్ అనే ఫ్యాన్ల తయారీ కంపెనీలో గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో... దట్టమైన పొగతో ఉవ్వెత్తున్నఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ హహకారాలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన యాజమాన్యం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పట్టపగలే సంభవించిన ప్రమాదంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, అక్కడున్న వారంతా భయంతో హడలెత్తిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్ధారించారు. కాగా, ప్రమాదంలో భారీగా యంత్ర సామాగ్రి మంటల్లో కాలిబూడిదై పోవటంతో, భారీగానే ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-05-28T22:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising