పింఛన్‌దారులు ఓటేసినా గెలుస్తాం
ABN, First Publish Date - 2020-10-04T08:19:08+05:30
‘దుబ్బాక నియోజకవర్గంలో 60 వేల పింఛన్ లబ్ధిదారులున్నారు.
దుబ్బాకలో 60 వేల మంది లబ్ధిదారులు
భార్యాభర్తలు మద్దతిచ్చినా చాలు: మంత్రి హరీశ్
తూప్రాన్, అక్టోబరు 3: ‘‘దుబ్బాక నియోజకవర్గంలో 60 వేల పింఛన్ లబ్ధిదారులున్నారు. ఇంట్లోని భార్యాభర్తలు ఓటేసినా టీఆర్‌ఎస్ పార్టీ ఉప ఎన్నికలో సునాయసంగా గెలుపొందుతుంది’’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం మెదక్ జిల్లా తూప్రాన్‌లో చేగుంట, నార్సింగి మండలాల టీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో పాటు, నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ ఓట్లతో చరిత్ర సృష్టిస్తుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీల డిపాజిట్ గల్లంతు చేయడమే టీఆర్‌ఎస్ పార్టీకి నిజమైన గెలుపు అని చెప్పారు. దుబ్బాకలో ఉప ఎన్నిక అయిపోగానే ఏ పార్టీ నాయకులు ఊళ్లలో కనిపించరని.. మళ్లీ కనిపించేది హరీశ్‌రావు, మదన్‌రెడ్డిలేనని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించే బీజేపీ ప్రభుత్వానికి దుబ్బాక ఓటర్లు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T08:19:08+05:30 IST