వైభవంగా నృసింహుని రథోత్సవం
ABN, First Publish Date - 2020-03-16T09:45:46+05:30
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవం గా నిర్వహించారు. వేద పండితులు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వామివారల
జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవం గా నిర్వహించారు. వేద పండితులు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి అనంతరం సాయంత్రం స్వామివారల రథాలను ఊరేగించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవతామూర్తులను రాత్రివేళలో చక్రతీర్థ స్నానానికి గోదావరి నదికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం పుష్పయాగం నిర్వహించారు.
ధర్మపురి
Updated Date - 2020-03-16T09:45:46+05:30 IST