ఔటర్‌పై ఫాస్టాగ్ తప్పనిసరి కాదు!
ABN, First Publish Date - 2020-12-11T09:06:11+05:30
జనవరి 1 నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు మాత్రమే టోల్‌ప్లాజాల వద్ద అనుమతి ఉంటుందని ఇటీవల నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలు వర్తించవు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జనవరి 1 నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు మాత్రమే టోల్‌ప్లాజాల వద్ద అనుమతి ఉంటుందని ఇటీవల నేషనల్ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అయితే, ఈ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్డుకు వర్తించవు. ఫాస్టాగ్ ఉన్నా, లేకున్నా ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను అనుమతిస్తామని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అధికారులు వెల్లడించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లిపోవడంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేసి శుక్రవారానికి రెండేళ్లు అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ఔటర్‌పై రోజూ వచ్చే 1.20 లక్షల వాహనాల్లో సగానికి పైగా ఫాస్టాగ్‌లను వినియోగిస్తున్నాయని వివరించారు.
Updated Date - 2020-12-11T09:06:11+05:30 IST