ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త మార్పులకు రైతులు అలవాటు పడాలి: నిరంజన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-05-22T19:42:55+05:30

రేఫటి వర్తకాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆత్మకమిటీ పాలక మండలి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరమైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రేఫటి వర్తకాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు మార్కెటింగ్ పద్దతులలో వచ్చే కొత్త మార్పులకు రైతులు అలవాటు పడాలన్నారు. కొహెడలో 170 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద  ఆధునిక మార్కెట్ యార్డు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నామన్నారు.


సిద్దిపేటలో సమీకృత మార్కెట్ యార్డు రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైనదిగా మంత్రి నిరంజన్ రెడ్డి కితాబిచ్చారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటితో కోటి ఎకరాలలో సశ్యశ్యామలమైన పంటలు పండబోతున్నాయన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పంటలను నిల్వచేసుకునేందుకు సరిపడ గోదాములు లేని పరిస్థితుల్లో కొత్త గోదాముల నిర్మాణానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సమగ్ర వ్యవసాయ విధానం అమలుకు ప్రతీ రైతు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.

Updated Date - 2020-05-22T19:42:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising