ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భవన్‌ ముట్టడికి రైతుల యత్నం

ABN, First Publish Date - 2020-11-13T09:32:00+05:30

సీఎం కేసీఆర్‌ చెబితేనే సన్నాలు వేశామని, పంట చేతికి వచ్చాక మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతు ఐక్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌ చెబితేనే సన్నాలు వేశామని, పంట చేతికి వచ్చాక మద్దతు ధర ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అన్నదాతలు గురువారం ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరు జిల్లాలకు చెందిన రైతులు దశల వారీగా ప్రగతి భవన్‌ వద్దకు వచ్చేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.


ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ సన్నరకం వడ్లకు రూ.2,500 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో భూపాలపల్లి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐఎ్‌ఫబీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-13T09:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising