ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అసలు పంటే వేయకపోతే రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా?’

ABN, First Publish Date - 2020-05-27T22:11:57+05:30

చెప్పిన పంట వేస్తేనే రైదుబంధు ఇస్తామంటోంది ప్రభుత్వం. మరి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చెప్పిన పంట వేస్తేనే రైదుబంధు ఇస్తామంటోంది ప్రభుత్వం. మరి అసలు పంటే వేయకపోతే రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా? దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా రైతుబంధు పథకం అమలు చేస్తోంది. గుంట భూమి ఉన్నాచాలు.. రైతు బంధు పథకానికి అర్హులేనని నిర్ణయించింది. అయితే ఈ పథకం నిబంధనలను రోజు రోజుకు కఠినతరం చేస్తోంది. పైకి చెప్పలేకపోతున్నా.. ప్రభుత్వానికి ఈ పథకం భారంగా పరిణమించిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ పథకానికి ఏడాదికి ఖర్చు రూ. 14వేల కోట్లకు చేరింది. ఇప్పుడు వెనక్కి తగ్గలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పథకంలో భారం తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధం పథకం వర్తిస్తుందని కొత్త షరతు విధించారు. దీనిపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెప్పిన పంట వేయకపోతే రైతు బంధు కట్ అంటోంది ప్రభుత్వం. అసలు పంట వేయకపోతే రైతు బంధుకు అర్హులేనా? అని రైతులు అంటున్నారు. పంట వేయకుండా రైతు బంధు తీసుకుంటున్నవారి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-05-27T22:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising