ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరూరా మొక్కలు నాటాలి..ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ABN, First Publish Date - 2020-09-21T06:53:42+05:30

ఊరూరా మొక్కలు నాటి, వనాలను విస్తరింపచేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జనగామ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ(లింగాలఘణపురం), సెప్టెంబరు 20 : ఊరూరా మొక్కలు నాటి, వనాలను విస్తరింపచేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం జనగామ మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ మేకల కళింగరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అమలు జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించడమే లక్ష్యం కావాలని సూచించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నిమ్మతి దీపికారెడ్డి, వైస్‌ఎంపీపీ చంద్రశేఖర్‌ ఎంపీడీవో సంపత్‌కుమార్‌, తహసీల్దార్‌ రవీందర్‌,  పీఏసీఎస్‌ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఐబీడీఈ రవీందర్‌, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising