ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి... కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి

ABN, First Publish Date - 2020-07-30T23:31:31+05:30

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తోన్న కూలీలను హఠాత్తుగా తొలగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ కూలీలంతా గత పధ్నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారిని ఏకపక్షంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తోన్నఫీల్డ్ అసిస్టెంట్లను హఠాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. ఈ ఉద్యోగులంతా గత పధ్నాలుగున్నర సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారిని ఏకపక్షంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వ నిర్ణయం నేపధ్యంలో... మొత్తం 7,714 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉపాధిని కోల్పోయారని హర్షవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆ ఉద్యోగులను తొలగిస్తూ... ఈ నెల 27 వ తేదీన జారీ చేసిన 4779 నంబర్ సర్క్యులర్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


లేనిపక్షంలో... ఆ ఉద్యోగులు ఆందోళనబాట పడతారని హెచ్చరించారు. ఇందుకు తమ పార్టీ కూడా మద్దతునిస్తుందని వెల్లడించారు. లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన టీఆర్‌ఎస్... అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-07-30T23:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising