ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం తయారీ, రవాణా నిల్వల పై దృష్టి పెట్టాలి:పార్ధసారధి

ABN, First Publish Date - 2020-11-26T01:42:27+05:30

జీ హెచ్ఎం సి ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా నిల్వలు మరియు మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీ హెచ్ఎం సి ఎన్నికల సందర్భంగా మద్యం తయారీ, రవాణా నిల్వలు మరియు మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్ధసారధి అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎక్సైజు శాఖ కమీషనర్, ఇతర ఉన్నతాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కింది సూచనలు చేశారు.


 అనధికార మద్యం దుకాణాలు (బెల్టు షాపులు) వెంటనే మూసివేయాలి.

 గత సంవత్సరం ప్రస్తుత సమయంలో జరిగిన మద్యం ఉత్పత్తులు, అమ్మకాలతో బేరీజు వేస్తూ పర్యవేక్షించాలి

 నల్ల బెల్లం మరియు అక్రమ మద్యం ఉత్పత్తికి వాడే ముడి సరుకులను సీజ్ చేయాలి

 అక్రమ మద్యం రవాణాను అరికట్టడానికి చెక్ పోస్టులు ప్రారంభించాలి

 29 వ తేదీ సా. 6.00 గం. ల నుండి 1 వ తేది పోలింగ్ ముగిసే వరకు జి హెచ్ యం సి పరిధిలో  మద్యం షాపులు మూసి వేయించాలి.

 మద్యం దుకాణాలు కౌంటింగ్ తేదీ రోజున జి హెచ్ యం సి పరిధిలో మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలి.

 మద్యం దుకాణాలలో మద్యం నిల్వలు అనుమతించిన పరిమాణం దాటకుండా చర్యలు తీసుకోవాలి. సమగ్రమైన పర్యవేక్షణ ఎప్పటికప్పుడు జరుపుతూ ఉండాలి.


ఈ సమావేశంలో ఎక్సైజు కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కమీషనర్ అజయ్, డిప్యూటీ కమీషనర్  సయ్యద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T01:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising