ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’

ABN, First Publish Date - 2020-09-19T13:21:38+05:30

రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు గండిమైసమ్మలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లల, కౌన్సిలర్లు, ముఖ్యనాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ స్థానిక ప్రాంతాల్లో పర్యటించి ఓటరు  నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో చేపట్టాలన్నారు. పట్టభద్రులైన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలన్నారు. పార్టీ అధిష్ఠానం బలపరిచిన అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి నమ్మకం ఉందని, వారి ఆశీర్వాదం తప్పక ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T13:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising