ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో రూ. 10వేలా?

ABN, First Publish Date - 2020-08-01T07:21:09+05:30

వామ్మో రూ. 10వేలా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఈసారి ఎంసెట్‌ దరఖాస్తుల సంఖ్య భారీగా ఉంటుందని భావించగా.. పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు ఫీజు రూ. 800తో పాటు రూ. 10వేల ఆలస్యరుసుముతో మొత్తం రూ. 10,800 చెల్లించాల్సి ఉంది. దరఖాస్తు గడువును ఆగస్టు 14 వరకు పొడిగించారు. శుక్రవారం వరకు ఇంజనీరింగ్‌లో 1,42,795, అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కోర్సులకు 78,646, రెండిటికీ 295 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం కలిపితే ఆ సంఖ్య 2,21,736 గా ఉంది.


మొత్తం నెలలో 190 దరఖాస్తులే.. 

ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను మొదటిసారిగా లాక్‌డౌన్‌కి ముందే ఫిబ్రవరి 21న విడుదల చేశారు.  లాక్‌డౌన్‌ కారణంగా పరీక్షలను జూలై   6 నుంచి 9 నిర్వహించాలని నిర్ణయించగా కరోనా ఉధృతితో వాయిదా వేశారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుకు గడువునూ పొడిగిస్తూ వస్తున్నారు. కానీ,  ఆలస్యరుసుము రూ. 10వేలను మాత్రం తగ్గించలేదు. దీంతో ఆర్థికభారం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ఆసక్తిగా ఉన్నా దరఖాస్తుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. జూన్‌-30 వరకు మొత్తం దరఖాస్తుల సంఖ్య 2,21,546 ఉండగా, శుక్రవారం (జూలై-31) నాటికి ఇది 2,21,736కి చేరింది. అంటే నెలరోజుల్లో మొత్తం వచ్చిన దరఖాస్తులు కేవలం 190 మాత్రమే. ఇందులో ఇంజనీరింగ్‌కు 125, వెటర్నరీ, అగ్రికల్చర్‌, ఫార్మసీకి 65 మాత్రమే ఉన్నాయి.

Updated Date - 2020-08-01T07:21:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising