ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ నేపథ్యంలో అభివృద్ధి పనులపై జీహెచ్‌ఎంసీ దృష్టి

ABN, First Publish Date - 2020-04-04T23:48:06+05:30

లాక్‌డౌన్ కారణంగా రోడ్లపై జన సంచారం లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. పెండింగ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా రోడ్లపై జన సంచారం లేకపోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న ఫ్లైఓవర్ పనులను, రోడ్ల మరమ్మతులను శరవేగంగా పూర్తి చేసేస్తున్నారు. కార్మికులు తగినంత సామాజిక దూరం పాటిస్తూ, రెండు షిప్టుల్లో ఈ అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండటంతో ఆయా పనులు చాలా నత్తనడకగా సాగేవి. రాత్రుల్లో పనిచేసినా సరే, పనులు అంత సజావుగా జరగకపోయేవి. ఇప్పుడు మాత్రం లాక్‌డౌన్ కారణంగా జనసంచారం పూర్తిగా లేకపోవడంతో అధికారులు హైస్పీడ్‌లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న కార్మికులకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లను అందిస్తూ, వారి యోగ క్షేమాలు చూసుకుంటూనే పనులను పూర్తి చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-04-04T23:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising