ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు: హైకోర్టుకు విద్యాశాఖ వెల్లడి

ABN, First Publish Date - 2020-09-19T00:42:59+05:30

పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు, ఫీజులపై హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల్లో ఫీజులపై హైకోర్టులో విద్యాశాఖ కౌంటర్ దాఖలు చేసింది. ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని ఏప్రిల్ 21న జీవో 46 జారీ అయిందని విద్యాశాఖ తెలిపింది. జీవో ప్రకారం బోధన రుసుములు నెలవారీగా తీసుకోవాలని పేర్కొంది. జీవో ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నట్లు 55 పాఠశాలలపై ఫిర్యాదులు వచ్చినట్లు స్పష్టం చేసింది. 55 పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పింది. షోకాజు నోటీసులకు 47 పాఠశాలలు వివరణ ఇచ్చాయని తెలిపింది. అధికారుల నుంచి క్షేత్రస్థాయి నివేదికలు రాగానే పాఠశాలలపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. జీవో 46ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. జీవో విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు విద్యాశాఖ నివేదించింది. కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఎస్ఈ గడువు కోరింది. దీంతో విచారణ అక్టోబరు 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.

Updated Date - 2020-09-19T00:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising