ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాక ఉపఎన్నిక.. ప్రారంభమైన పోలింగ్..

ABN, First Publish Date - 2020-11-03T13:23:55+05:30

దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు. కాగా, కోవిండ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి సానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు చేరుకుంటున్నారు. కాగా, కోవిండ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి సానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. అలాగే మందులను కూడా అందుబాటులో ఉంచారు. ఇదిలాఉండగా, ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల మధ్య ఘర్షణల నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. మరోవైపు దుబ్బాకలోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని సీపీ జోయల్ డేవిస్ పరిశీలించారు. ఇదిలాఉండగా, దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Updated Date - 2020-11-03T13:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising