ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత క్రీడల్లో రాణించాలి : డీఎస్పీ

ABN, First Publish Date - 2020-11-21T10:26:29+05:30

యువత క్రీడల్లో రాణించాలి : డీఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగూడ, నవంబరు 20: గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదగాలని డీఎస్పీ నరేష్‌కుమార్‌ అన్నారు. గూడూరు సర్కిల్‌ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల పరిధిలో స్థానికంగా నిర్వహిస్తున్న కబడ్డీ, వాలీబాల్‌ క్రీడలను డీఎస్పీ నరేష్‌కుమార్‌ శుక్రవారం జెండావిష్కరణ చేసి ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలను వీడి సన్మార్గంలో నడవాలని సూచించారు. క్రీడలకు కొత్తగూడ పుట్టినిల్లు లాంటిదన్నారు. ఈ ప్రాంతం నుంచే అనేక మంది క్రీడాకారులు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బానోత్‌ విజయరూప్‌సింగ్‌, జడ్పీటీసీ పుల్స పుష్పలత, సీఐ రాజిరెడ్డి, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసం స్వామి, ఒలంపిక్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు వజ్జ సురేందర్‌, సర్పంచ్‌ మల్లెల రణధీర్‌, వైద్యుడు రవీందర్‌, ప్రధానోపాధ్యాయుడు ఈసం సురేందర్‌రావు, ఎస్సైలు తాహేర్‌బాబా, చంద్రమోహన్‌, సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-21T10:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising