ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జయశంకర్‌ వర్సిటీలో డ్రోన్‌ ప్రయోగం షురూ

ABN, First Publish Date - 2020-09-25T08:45:50+05:30

రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా సంస్థను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి గురువారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధనా సంస్థను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి గురువారం సందర్శించారు. అనంతరం డ్రోన్‌ ప్రయోగాన్ని ప్రారంభించారు.


తెలంగాణ ఐటీ శాఖ, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ల సహకారంతో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా యూనివర్సిటీ పరిఽధిలోని ఆర్‌ఏఆర్‌ఎస్‌ జగిత్యాల, పాలెం- వరంగల్‌, ఏఆర్‌ఎస్‌ తాండూర్‌, రాజేంద్రనగర్‌ వరి పరిశోధనా సంస్థలో ‘ఎవల్యూషన్‌ అండ్‌ స్టాండర్డైజేషన్‌ ఆఫ్‌ ప్లాంట్‌  ప్రొటక్షన్‌ సొల్యూషన్స్‌ ఇన్‌ మేజర్‌ ఫీల్డ్‌ క్రాప్స్‌ యూజింగ్‌ డ్రోన్‌ టెక్నాలజీ’ నెట్‌వర్క్‌ ప్రాజెక్టును అమలుచేస్తోంది. ఈ క్రమంలో జనార్దన్‌రెడ్డి, జయే్‌షరంజన్‌ డ్రోన్‌ ప్రయోగాన్ని పరిశీలించారు. వర్సిటీ పరిధిలో ఐదు పంటలపై ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వీసీ  ప్రవీణ్‌రావు తెలిపారు.  

Updated Date - 2020-09-25T08:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising