ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డబుల్‌’ ఇళ్లలో అవినీతిని సహించం: పోచారం

ABN, First Publish Date - 2020-05-31T08:16:31+05:30

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడే టీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్‌ పోచారం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇళ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వద్దు: నిరంజన్‌


వర్ని/వనపర్తి రూరల్‌, మే 30: డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అవినీతి, అక్రమాలకు పాల్పడే టీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి హెచ్చరించారు. డబ్బులకు లాలూచీ పడి అనర్హులకు ఇళ్లను కేటాయిస్తే పేదోళ్ల ఉసురు ఊరికే పోదని, ఏదో రూపంలో అవినీతిపరుల అంతం చూస్తుందని అన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపకంలో ఓ గ్రామంలో అవినీతి ఆరోపణలు రావడంతో తక్షణమే ఇంటెలిజెన్స్‌, రెవెన్యూ అధికారులతో విచారణ జరిపించామని, నివేదిక వచ్చిన తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలోని అప్పాయిపల్లి వద్ద నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ  పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. శనివారం ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. తక్షణమే 3 బ్లాకులలోని 24 గృహాలను పూర్తిచేసి అప్పగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-05-31T08:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising