కోవిడ్ తీవ్రత మరింత తగ్గింది: డీహెచ్ శ్రీనివాస్
ABN, First Publish Date - 2020-11-13T20:13:18+05:30
హైదరాబాద్: కోవిడ్ తీవ్రత మరింత తగ్గిందని కోఠి కమాండ్ సెంటర్ డీహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
హైదరాబాద్: కోవిడ్ తీవ్రత మరింత తగ్గిందని కోఠి కమాండ్ సెంటర్ తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కేసుల తగ్గుదలకు ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్తలు ఉపయోపడుతున్నాయన్నారు. 1200 రాపిడ్, 310 మొబైల్ టెస్టింగ్ సెంటర్స్ ద్వారా టెస్టులు చేస్తున్నామన్నారు. చలి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ ప్రభలే అవకాశం ఉందన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచాను నిషేధించారన్నారు. కరోనా నేపథ్యంలో బాణసంచా లేకుండా దీపావళి జరుపుకోవాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ అతి తక్కువ కాలంలో వచ్చేలా చూస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.
Updated Date - 2020-11-13T20:13:18+05:30 IST