ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొటోకాల్‌ పాటించరా?

ABN, First Publish Date - 2020-12-15T07:45:20+05:30

సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ప్రతిపక్ష నేతల విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు

మెదక్‌ రూరల్‌, డిసెంబరు 14: సిద్దిపేట, మెదక్‌ జిల్లాల కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి ప్రతిపక్ష నేతల విషయంలో ప్రొటోకాల్‌ పాటించడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు ఆరోపించారు. మెదక్‌ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేటకు వస్తే జిల్లా కలెక్టర్‌ ప్రొటోకాల్‌ పాటించలేదని అన్నారు.


అలాగే సోమవారం నిర్వహించిన మెదక్‌ జిల్లా పరిషత్‌ సమావేశానికి తొలిసారి వచ్చిన తనను సభ్యులకు పరిచయం చేయాలన్న కనీస బాధ్యతను జిల్లా యంత్రాంగం మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. జడ్పీ సమావేశం జరుగుతున్న తీరుసరిగా లేదని, చైర్‌పర్సన్‌ను మౌనంగా ఉంచి ఇతరులు సమావేశాన్ని హైజాక్‌ చేస్తున్నారని ఆరోపించారు. మొదటి సమావేశం కావడంతో నిరసన వ్యక్తం చేయడం లేదని, రాబోయే రోజుల్లో ఆదే విధానం కొనసాగితే తప్పకుండా అడ్డుకుంటామని రఘునందన్‌ హెచ్చరించారు. 


ఉద్యోగులు కేసీఆర్‌పై యుద్ధం చేయాలి

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్రంపై యుద్ధం చేస్తున్నట్టే.. ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌పై చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు సూచించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీ్‌్‌సస్టేషన్‌కు తరలించారు.
అనంతరం రఘునందన్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పక్షాన బీజేపీ అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టిందని, రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-15T07:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising