డయల్-100, 181 పనితీరును పరిశీలించిన హైపవర్ కమిటీ
ABN, First Publish Date - 2020-12-11T08:24:00+05:30
మహిళలు, చిన్నారుల భద్రతకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ సభ్యులు గురువారం జీవీకే ఎవర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఈఎంఆర్‌ఐ
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మహిళలు, చిన్నారుల భద్రతకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ సభ్యులు గురువారం జీవీకే ఎవర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఈఎంఆర్‌ఐ)ను సందర్శించి అత్యవసర డయల్-100, 181 నెంబర్ల పని తీరును పరిశీలించారు. ఆయా విభాగాల నిర్మాణం, పనితీరును వారు అధ్యయనం చేశారు.
జీఎంఆర్‌ను సందర్శించినవారిలో కమిటీ సభ్యులు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎస్సీ అభివృద్ధి విభాగం కమిషనర్ యోగితా రాణా, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ, సీఎంఓ ఓఎ్‌సడీ ప్రియాంక వర్గీస్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, డీఐజీ సుమతి, హైదరాబాద్ కలెక్టర్ స్వేతా మహంతి ఉన్నారు.
Updated Date - 2020-12-11T08:24:00+05:30 IST