ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు

ABN, First Publish Date - 2020-09-24T16:20:04+05:30

హైదరాబాద్: తెలంగాణలో ఓ పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు జరుగుతున్నాయి. పైప్‌లైన్ ప్రాజెక్టు పేరుతో ఎలాంటి పరికరాలు సప్లై చేయకుండా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ఓ పైపుల కంపెనీపై డీజీజీఐ దాడులు జరుగుతున్నాయి. పైప్‌లైన్ ప్రాజెక్టు పేరుతో ఎలాంటి పరికరాలు సప్లై చేయకుండా.. రూ.139 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారు. నకిలీ ఇన్‌వాయిస్‌లతో కంపెనీ రూ.14 కోట్ల ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ పొందింది. పక్కా సమాచారంతో హైదరాబాద్‌లో ఏక కాలంలో 4 చోట్ల డీజీజీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ పంథాతో.. కంపెనీ టర్నోవర్‌ను నిర్వాహకులు పెంచుకున్నట్టు తెలుస్తోంది.


వీటి ద్వారా ప్రభుత్వరంగ ప్రాజెక్టులకు టెండర్లు వేసి.. నిర్మాణ ప్రాజెక్టులు కంపెనీ చేజిక్కించుకుంటోంది. అక్రమంగా వచ్చిన డబ్బుతో కంపెనీ లగ్జరీ కార్లను  కొనుగోలు చేసినట్టు సమాచారం. కంపెనీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో జరిపిన..లావాదేవీలను జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. లావాదేవీలకు ఉపయోగిస్తున్న రెండు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. కంపెనీ డైరెక్టర్‌ను అరెస్ట్ చేసిన డీజీజీఐ అధికారులు అక్టోబర్ 6 వరకు రిమాండ్ విధించారు.

Updated Date - 2020-09-24T16:20:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising