ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ పేరుతో నిర్బంధం: పౌర హక్కుల సంఘం

ABN, First Publish Date - 2020-04-09T09:57:12+05:30

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పేరుతో పోలీసులు వీధులను నిర్బంధం చేస్తున్నారని పౌర హక్కుల సంఘం ఆరోపించింది. పోలీసులు లాఠీచార్జీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి తాము వ్యతిరేకం కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పేరుతో పోలీసులు వీధులను నిర్బంధం చేస్తున్నారని పౌర హక్కుల సంఘం ఆరోపించింది. పోలీసులు లాఠీచార్జీలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. కరోనా వైరస్‌ కట్టడికి తాము వ్యతిరేకం కాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పూర్తిగా సమర్థిస్తున్నామని తెలిపింది. లాక్‌డౌన్‌ పేరుతో పోలీస్‌ నిర్బంధానికి వ్యతిరేకంగా పౌరహక్కుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్‌, నారాయణరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 22న ‘జనతా కర్ఫ్యూ’ తర్వాత కరోనాను కేంద్రం సీరియ్‌సగా తీసుకుందని, నెల రోజుల సమయాన్ని వృథా చేసిందని వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న హడావిడి నిర్ణయాలతో కోట్లాది మంది వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికైనా హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని, కార్పొరేట్‌ ఆస్పత్రుల సేవలు వినియోగించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల వేతనాల్లో కొత విధించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని, సీఎం కేసీఆర్‌ మాత్రం వేతనాల్లో కోతపెట్టడమేంటని ప్రశ్నించారు.

Updated Date - 2020-04-09T09:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising