వాపస్ ఇచ్చిన వ్యాట్ వసూలు చేయాలి
ABN, First Publish Date - 2020-06-01T09:41:10+05:30
వాపస్ ఇచ్చిన వ్యాట్ వసూలు చేయాలి
- 14 బీసీ సంఘాల డిమాండ్
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కాంట్రాక్టర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా వాపసు తీసుకున్న రూ.500కోట్ల వ్యాట్‌ను తిరిగి వసూలు చేయాలని సీఎం కేసీఆర్‌ను 14 బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. సవరించిన అంచనాల పేరుతో ఇరిగేషన్, మిషన్ భగీరథ కాంట్రాక్టరు రూ.15వేల కోట్ల బడ్జెట్‌ను అధికంగా తీసుకున్నారంటూ ఫిర్యాదులు అందినా.. ఎలాంటి విచారణ చేయలేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఆ డబ్బును సర్కారు వసూలు చేయకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2020-06-01T09:41:10+05:30 IST