ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల విద్యుత్‌ ఉత్పత్తి తగ్గుదల

ABN, First Publish Date - 2020-12-10T10:13:16+05:30

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసినా, రికార్డు స్థాయిలో జలాశయాలు నిండినా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి ఉంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం రాష్ట్రంలో హైడల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత ఏడాది కన్నా 1,000 మిలియన్‌ యూనిట్లు తక్కువ


హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసినా, రికార్డు స్థాయిలో జలాశయాలు నిండినా జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేని పరిస్థితి ఉంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం రాష్ట్రంలో హైడల్‌ జనరేషన్‌ ఉత్పత్తిని నీరు గార్చింది. 2019-20లో 3,963 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరగ్గా ఈ ఏడాది డిసెంబరు 8 నాటికి 2,978 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తిని మాత్రమే సాధించింది. వాస్తవానికి 2020-21లో 3,243 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని జెన్‌కో టార్గెట్‌గా పెట్టుకుంది. లెక్క ప్రకారం ఈ సీజన్‌లో 4,500 మిలియన్‌ యూనిట్ల దాకా ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉండగా... శ్రీశైలం ప్రమాదంతో ఉత్పత్తి కుంటుపడింది. శ్రీశైలంలో 1,400 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరగాలని టార్గెట్‌గా పెట్టుకోగా... 913.38 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. వాస్తవానికి రోజుకు 20 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగేది. ఒక్క ప్రమాదంతో యూనిట్లన్నీ మూతపడటంతో రెండు నెలల్లో దాదాపు 1,200 మిలియన్‌ యూనిట్ల మేర ఉత్పత్తి ఆగిపోయింది. వెరసి రూ.500 కోట్ల విలువైన విద్యుత్‌ను జెన్‌కో కోల్పోవాల్సి వచ్చింది. 

Updated Date - 2020-12-10T10:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising