ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో 14కు చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2020-04-12T18:29:07+05:30

నగరంలో కరోనా వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా అతనికి వైరస్ సోకింది. సోమాజిగూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. ఈ రెండు మరణాలతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 14కు చేరింది.


రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్‌ల సంఖ్య 503కు చేరింది. అయితే సూర్యాపేట జిల్లాలో తొలుత మూడు కేసులేనని వెల్లడించగా శనివారం రాత్రి 11 గంటల సమయానికి 11 కేసులు నమోదయినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇవి కూడా కలిపితే కొత్తగా పాజిటీవ్ కేసుల సంఖ్య 24కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 393 పాజిటీవ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 51 మందిని డిశ్చార్జ్ చేశారు.

Updated Date - 2020-04-12T18:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising