ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హేమంత్‌ను ఎలా చంపారో చెప్పిన డీసీపీ

ABN, First Publish Date - 2020-09-25T17:59:45+05:30

నగరంలో మరో పరువు హత్య జరిగింది. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో మరో పరువు హత్య జరిగింది. హేమంత్, అవంతి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే  అవంతి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు హేమంత్‌ను దారుణంగా హత మార్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వెల్లడించారు. నాలుగు నేలల క్రితం హేమంత్, అవంతిక ప్రేమ పేళ్లి చేసుకుని, గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ నివాసం ఉంటున్నారని తెలిపారు. 


నిన్న మాట్లాడాలంటూ అవంతిక కుంటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని హేమంత్ నివాసానికి వచ్చారని డీసీపీ చెప్పారు. వారిని కారులో తీసుకువెళుతుండగా అనుమానం రావడంతో తప్పించుకునేందుకు అవంతిక, హేమంత్ ప్రయత్నించారని, కారులో నుంచి దూకిన అవంతిక అత్తమామలకు ఫోన్ చేసిందన్నారు. అవంతిక మేనమామ మరికొందరు కలిసి హేమంత్‌ను మరో కారులో తీసుకొని వెళ్లారని హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేంటనే అప్రమత్తమయ్యామన్నారు. గోపన్ పల్లిలో తోమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అర్ధరాత్రి అవంతిక మేనమామ యుగంధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసి పడేసిన్నట్లు ఓప్పుకున్నాడని తెలిపారు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - 2020-09-25T17:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising