ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2020లో తగ్గిన నేరాల శాతం: జనగామ డీసీపీ

ABN, First Publish Date - 2020-12-31T04:05:15+05:30

2020లో తగ్గిన నేరాల శాతం: జనగామ డీసీపీ

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ టౌన్‌, డిసెంబరు 30: జనగామ వెస్ట్‌జోన్‌ పరిధిలో 2020 సంవత్సరంలో నేరాల శాతం గణనీయంగా తగ్గిందని వెస్ట్‌ జోన్‌ డీసీపీ బి.శ్రీనివాసరెడ్డి అన్నారు. పోలీసులు కరోనా వారియర్స్‌గా పనిచేశారని, లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలను గుర్తించి స్వస్థలాలకు పంపించారని, లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారని, ఈ క్రమంలో 130 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల శాతం గణనీయంగా తగ్గిందని, మూడు హత్యలు, 21 హత్యాయత్నాలు జరిగాయన్నారు. దోపిడీ కేసులు లేవని, పగటి దొంగతనాలు గతేడాది 15 కాగా ఈ ఏడాది కేవలం మూడు నమోదయ్యాయని అన్నారు. రౌడీ షీటర్లు, పోకిరీలను అణచివేశామన్నారు. 159 మంది ఇసుక రవాణాదారులపై, గుట్కా అమ్మకాల్లో 27 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. డయల్‌ 100కు 16,114 ఫిర్యాదులు అందగా పోలీసులు సకాలంలో స్పందించి సేవలందించారని వివరించారు. సమావేశంలో ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ డి.మల్లేశ్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T04:05:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising