ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు డీసీసీబీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2020-02-20T10:11:22+05:30

డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఇందుకు సంబంధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసింది. ఈ ఎన్నికలకు ఓటర్ల(చైర్మన్ల) జాబితా తయారీకి మూడు రోజులు సమయం తీసుకున్నారు. జిల్లాలవారీగా డీసీసీబీలు, డీసీఎమ్మె్‌సలకు ప్రత్యేక ఓటర్ల జాబితాలు తయారుచేశారు. ‘ఏ- గ్రూపు’లో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 906 మంది చైర్మన్లకు కూడా ఓటు హక్కు కల్పించడం గమనార్హం. వాస్తవానికి డీసీసీబీ, డీసీఎమ్మె్‌సలకు బకాయిలు ఉన్న పీఏసీఎ్‌సల చైర్మన్లకు ఓటుహక్కు ఉండేదికాదు. ఈదఫా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దీంతో కొత్తగా ఎన్నికైన చైర్మన్లందరికీ ఓటు హక్కు వచ్చింది. ఇక ‘బీ- గ్రూపు’లో ఉన్న వివిధ రకాల సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించలేదు. వీరికి కూడా మినహాయింపులు ఇచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే జిల్లాలవారిగా తయారుచేసిన ఓటర్ల జాబితాలు ఇంకా రాష్ట్ర ఎన్నికల అథారిటీకి రాలేదని, గురువారం జాబితాలు రాగానే నోటిఫికేషన్‌ జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని అడిషనల్‌ రిజిస్ట్రార్‌ వి.సుమిత్ర తెలిపారు.

Updated Date - 2020-02-20T10:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising