ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలు మరణం పట్ల దత్తాత్రేయ సంతాపం

ABN, First Publish Date - 2020-09-25T23:41:44+05:30

బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలపారు. బాలు  తనకు అత్యంత సన్నిహితుడని తన మరణం  తీవ్రంగా కలచివేసిందని దత్తాత్రేయ తెలిపారు. ఆయన మరణం ప్రజలకు,సంగీతప్రియులకు తీరని లోటని చెప్పారు.  బాలు గా పిలుచుకునే ఎస్ పీ బాలసుబ్రమణ్యం ఒక గొప్ప సంగీతకారుడు, ప్లేబ్యాక్ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు చలన చిత్ర నిర్మాత అని దత్తాత్రేయ పేర్కొన్నారు. చాలామంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారని, పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసిందని దత్తాత్రేయ అన్నారు. 


తన 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 11 బాషలలో  40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడని దత్తాత్రేయ గారు చెప్పారు. భారతీయ సినిమా కి ముఖ్యంగా తెలుగు సినిమా కి ఎనలేని కృషి చేసిన బాలు గారి కి పలు నంది అవార్డులు అలాగే భారత ప్రభుత్వం చే "పద్మ భూషణ్" అవార్డు అందుకున్నారని దత్తాత్రేయ గారు  తెలిపారు.


తాను 2004  లో ప్రారంభించిన "వందేమాతరం సెంటినరీ కమిటీ " కి బాలు  వైస్ ఛైర్మెన్ గా సేవలు అందించారని శ్రీ దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. వీటన్నటితో పటు బాలు గారి వ్యక్తిత్వం,వారి చిరునవ్వు అందరిని మంత్రముగ్దుల్ని చేసేదని దత్తాత్రేయ చెప్పారు. బాలు మనందరినీ విడిచి వెళ్లడం చాలా బాధాకరమన్నారు.  

Updated Date - 2020-09-25T23:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising