సైబర్ నేరాల్ని సమర్థంగా ఛేదించాలి: డీజీపీ
ABN, First Publish Date - 2020-12-29T08:39:13+05:30
పెరుగుతున్న సైబర్ నేరాల్ని సమర్థంగా ఛేదించాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. వారితో ఆయన సోమవారం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు
పెరుగుతున్న సైబర్ నేరాల్ని సమర్థంగా ఛేదించాలని కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. వారితో ఆయన సోమవారం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో నేరం రుజువు చేసేందుకు అవసరమైన సాంకేతిక ఆధారాల్ని సేకరించాలని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల్ని పరిష్కరించాలని సూచించారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Updated Date - 2020-12-29T08:39:13+05:30 IST