ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాల అమలు తప్పదు: నిరంజన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-12-15T08:11:22+05:30

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు రక్షణలేదని, ప్రభుత్వ రక్షణ లేకుండా స్వేచ్ఛా వాణిజ్యంతో రైతులకు లాభం కలగదని రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు రక్షణలేదని, ప్రభుత్వ రక్షణ లేకుండా స్వేచ్ఛా వాణిజ్యంతో రైతులకు లాభం కలగదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రుల నివాస సముదాయం నుంచి నూతన వ్యవసాయ చట్టాలు, పర్యావసానాలపై ‘ఎన్‌ఆర్‌ఐ’లతో నిర్వహించిన జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ చట్టాల అమలు విషయంలో కేంద్రం బలవంతం చేస్తే, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో అమలు చేయక తప్పదని చెప్పారు.


అయితే వ్యవసాయ మార్కెట్లను తీసేయకుండా మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. పంజాబ్‌, హరియాణలో 50ు పైగా రైతులు తమ ధాన్యాన్ని మండీల్లో అమ్ముకుంటారని, అందుకే వారు ముందుగా సాగు చట్టాలపై స్పందించారని పేర్కొన్నారు. ఢిల్లీకి దగ్గరగా ఉండటంతోనే అక్కడికి వెళ్లగలిగారని, ఢిల్లీకి వెళ్లని రైతులు, రాష్ట్రాలు ఈ చట్టాలను ఆహ్వానిస్తున్నారని అనుకోవటం తప్పని అన్నారు.


రాష్ట్రంలో దొడ్డు, సన్నరకాలన్నింటికీ రూ. 1,888 ధర ఇస్తున్నామని, అంతకుమించి ఇవ్వకుండా కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని ఓ ఎన్‌ఆర్‌ఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. కాన్ఫరెన్స్‌లో టీఆర్‌ఎస్‌ యూఎ్‌సఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్‌ మహేష్‌ తన్నీరు, కన్వీనర్లు చందు తాళ్ల, వెంగల్‌ జలగం, కార్యదర్శి అరవింద్‌ తక్కళ్లపల్లి, కళ్యాణ్‌ చక్రవర్తి, 85 మంది ఎన్నారైలు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T08:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising