ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు భద్రతపై ప్రభుత్వ చర్యలకు సుప్రీం కమిటీ సంతృప్తి

ABN, First Publish Date - 2020-12-04T00:17:19+05:30

రహదారి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీం కోర్టు కమిటీ సంతృప్తివ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రహదారి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీం కోర్టు కమిటీ సంతృప్తివ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. జస్టిస్‌ అభయ్‌ మనోహర్‌ సాప్రే అధ్యక్షతన రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రహదారి భద్రత చర్యలను సమీక్షించింది. 


ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిశాఖలతో ఈనెల 11వ తేదీన సమావేశమై రోడ్డు భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించనున్నట్టు కమిటీకి తెలిపారు.ఈ సమావేశంలో రవాణా,రోడ్డు , భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, అడిషనల్‌ డీజీ జితేందర్‌, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్‌ఇన్‌చీఫ్‌ గణపతిరెడ్డి , జాతీయ రహదారుల అధారిటీ రీజినల్‌ ఆఫీసర్‌ కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-04T00:17:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising