ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర్ధవంతమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులు- సీఎస్‌

ABN, First Publish Date - 2020-08-03T21:27:57+05:30

రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్ధవంతమైన, ఖచ్చితమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్ధవంతమైన, ఖచ్చితమైన సేవలు అందించేందుకే ఈ-ఆఫీసులను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం సెక్రటేరియట్‌లోని 8 శాఖలలో రెండుశాఖల్లో ఈ-ఆఫీసును ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా , వేగంగా ప్రాసెస్‌ చేయడానికి వీలు కలుగుతుందని అన్నారు. ఎక్కడి నుంచయినా పని చేయడానికి వీలు కలగడంతో పాటు సమర్ధవంతమైన పాలనను అందించ వచ్చన్నారు. 


సెక్రటేరియట్‌లోని వైద్య , ఆరోగ్య, ప్లానింగ్‌,కార్మికశాఖ, బిసి సంక్షేమం, షెడ్యూల్డ్‌కులాల అభివృద్ధిశాఖ, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, హోంశాఖలతో పాటు పిసిబి, వ్యవసాయశాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-ఆఫీసు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ సెక్రటేరియట్‌లో 15శాఖల్లో ఈ-ఆఫీసును అమలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన శాఖల్లోనూ వారంలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో కార్మికశాఖ స్పెషల్‌సీఎస్‌ రాణికుముదిని, ఐటిశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-03T21:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising