ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం: నారాయణ

ABN, First Publish Date - 2020-10-03T09:47:52+05:30

లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికి దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌లో శుక్రవారం జరిగిన హోంఫర్‌ ఏజ్డ్‌ 21వ వార్షికోత్సవంలో  ఆయన మాట్లాడారు. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటనలో నేరారోపణలు ఎదుర్కొన్నవారినందరినీ నిర్దోషులుగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందన్నారు. దేశంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు  ఘోరంగా విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు.


మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగాభారత జాతీయ మహిళా సమాఖ్య, దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాజధానిలో శుక్రవారం నిర్వహించిన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎ్‌సఎస్‌ కనుసన్నల్లో మెలుగుతూ దేశభక్తి ముసుగులో భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తుందని వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాగా యోగి హేమంత్‌ కుమార్‌ ప్రాణాలను రక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్‌ అలీకి చాడ వెంకట్‌రెడ్డి శుక్రవారం ఓ లేఖ రాశారు. వ్యవసాయ సంస్కరణ చట్టాలు రైతులను కూలీలుగా మారుస్తాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌,  మహిళా నాయకురాలు పశ్య పద్మ  విమర్శించారు. 

Updated Date - 2020-10-03T09:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising