డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్ల జైలు: సీపీ సజ్జనార్
ABN, First Publish Date - 2020-12-29T19:46:48+05:30
మందుబాబులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక చేశారు.
హైదరాబాద్: మందుబాబులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని వ్యాఖ్యానించారు. ఈ వారం రోజులు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 402 మంది పట్టుపడ్డారన్నారు. కాగా ఇప్పటికే హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
Updated Date - 2020-12-29T19:46:48+05:30 IST