గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది: సీపీ
ABN, First Publish Date - 2020-09-01T17:39:02+05:30
నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మంగళవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఇప్పటి వరకు 450 పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యాయన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. కోవిడ్ నిబంధనలతో నిమజ్జనం సాగుతోందన్నారు. ఇంకా 2500 పైగా విగ్రహాలు ఉన్నట్టు సమాచారం ఉందని సీపీ అంజనీకుమార్ తెలిపారు.
Updated Date - 2020-09-01T17:39:02+05:30 IST