ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ముళ్ల కంచెలు

ABN, First Publish Date - 2020-03-25T20:36:34+05:30

నాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్‌తో సహా 150కి పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. భారత్‌తో సహా 150కి పైగా దేశాలు కరోనా బారిన పడ్డాయి. దీంతో కరోనా వ్యాప్తిని తగ్గించడానికి దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అందులోభాగంగానే తెలంగాణలో ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేసింది. అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. అంతేకాదు బయటివారితో కలవకూడదని సూచించింది. అదేవిధంగా బయటివారిని గ్రామాల్లోకి రానివ్వకూడదని ప్రభుత్వం నింబధన పెట్టింది. దీంతో తెలంగాణలోని అనేక గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలను గ్రామస్థులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గ్రామాల్లోకి బయటివారిని అనుమతించడం లేదు. గ్రామాల పొలిమేరల్లో ముళ్లకంచెలు వేశారు. పక్కగ్రామాల వారిని కూడా తమ గ్రామాల్లోకి రానివ్వడం లేదు. గ్రామాల్లోని వారిని కూడా బయటకు వెళ్లనివ్వడం లేదు. అంతేకాదు గ్రామాల రహదారులను కూడా మూసేశారు. 


తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఏ ఊరికి ఆ ఊరు సరిహద్దులను మూసేసి.. బయటవారిని లోనికి రాకుండా చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. ఊరి ముఖ ద్వారం దగ్గర ముళ్ల కంచెలను అడ్డుగా వేస్తున్నారు. ‘మా ఊరికి మీరు రావొద్దు.. మీ ఊరికి మేము రాము’ అంటూ కొత్త నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. 

Updated Date - 2020-03-25T20:36:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising