ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలో విజృంభిస్తున్న కరోనా

ABN, First Publish Date - 2020-05-09T22:51:35+05:30

ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోంది. ఎల్‌బీ నగర్‌ జోన్‌లో ఇప్పటి వరకు 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్‌బీ నగర్‌ జోన్‌లో ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోంది. ఎల్‌బీ నగర్‌ జోన్‌లో ఇప్పటి వరకు 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎల్‌బీ నగర్‌ జోన్‌లో ఇప్పటి వరకు కరోనాతో ఐదుగురు మృతి చెందారు. వనస్థలిపురంలో 26 కేసులు, బీఎన్‌రెడ్డి ఎస్‌కేడీ నగర్‌లో రెండు కరోనా కేసులును అధికారులు గుర్తించారు. హయత్‌నగర్ ద్వారక నగర్, సాయినగర్, సచివాలయ కాలనీలో 11 కేసులు, నాగోల్, లింగోజిగూడ డివిజన్లలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసును నిర్ధారించారు. రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఎల్‌బీ నగర్‌ జోన్‌లో 15 కట్టడి ప్రాంతాలను  జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసింది. కట్టడి ప్రాంతాలకు ఎవరూ వెళ్లకుండా పోలీస్ నిఘా ఉంచారు.


గ్రేటర్‌లో కట్టడి ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కట్టడి లేని ప్రాంతాల్లో వైరస్ విస్తరిస్తోంది. ఇతర ప్రాంతాల్లో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 29 మంది మృతి చెందారు. అయితే గ్రేటర్‌లోనే 25 మంది మృతి చెందినట్లు సమాచారం. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య జీహెచ్‌ఎంసీలో అధికంగా ఉండడంతో నగరావాసులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మూడు జిల్లాలను కేంద్ర రెడ్‌జోన్లుగా ప్రకటించింది.

Updated Date - 2020-05-09T22:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising