ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా జర్నీ: ఢిల్లీ టు తిరుపతి.. వయా హైదరాబాద్..

ABN, First Publish Date - 2020-04-01T01:49:34+05:30

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఏపీలో 40, తెలంగాణ 77 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరీ ముఖ్యంగా మూడు రోజులు నుంచి నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కరోనా వ్యాప్తి చెందడంతో రెండు రాష్ట్రాల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు సమావేశాల్లో నాలుగు రోజుల పాటు ప్రార్ధనలు జరిగాయి. ఆ ప్రార్ధనలకు విదేశాల నుంచి వాళ్లతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత వీరంతా ఢిల్లీ నుంచి తెలంగాణ మీదుగా తిరుపతికు వెళ్లే రైలులో ప్రయాణించి స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే తెలంగాణకు చెందిన 1030 మంది, ఏపీకి చెందిన 711 మంది ప్రార్థనలకు వెళ్లిన వచ్చినట్లు తెలిసింది. వీళ్లందిరనీ కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. 

Updated Date - 2020-04-01T01:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising