ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా లక్షణాలుంటే భయపడద్దు

ABN, First Publish Date - 2020-03-27T09:49:55+05:30

కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధైర్యంగా అధికారులకు సమాచారం ఇవ్వండి: హరీశ్‌

సిద్దిపేట, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా లక్షణాలుంటే భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే అధికారులకు, వైద్యులకు సమాచారం ఇవ్వాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలకు సూచించారు. తమ పొరపాటుతో వైరస్‌ రాలేదన్న విషయాన్ని బాధితులు గుర్తించాలని ధైర్యం చెప్పారు. జిల్లా అధికారులతో సిద్దిపేట జిల్లా కేంద్రం నుంచి ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని కూడా గాంధీ ఆస్పత్రిలో నయం చేసి పంపించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.


కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి చెప్పకున్నా, చుట్టుపక్కల వాళ్లు గుర్తించి 100 నెంబర్‌కు ఫోన్‌ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక సిద్దిపేట జిల్లా నుంచి హైదరాబాద్‌కు కూరగాయలను ఎగుమతి చేయడానికి రైతులకు పాసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. సిద్దిపేటలో 24గంటల పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.  

Updated Date - 2020-03-27T09:49:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising