ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజూ 1500 మందికి అన్నదానం అంటే మాటలా...

ABN, First Publish Date - 2020-04-03T00:40:40+05:30

లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో పేదల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సర్వం బంద్ కావడంతో బీదాబీక్కీ జనాలకు ఉపాధి కరవయింది. అనేక బస్తీల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో పేదల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సర్వం బంద్ కావడంతో బీదాబీక్కీ జనాలకు ఉపాధి కరవయింది. అనేక బస్తీల్లో వేల మంది అసంఘటిత కార్మికులు కూలీలకు చేద్దామంటే పనిలేదు. తిందామంటే తిండీ లేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న దయా సంపన్నులు కొందరు వెంటనే రంగంలోకి దిగారు. ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నదానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి ఉదార్థ మనసుకులు గల సయ్యద్ ఖాజీ అలీ హష్మీ ఒకరు. ఎస్కేఏహెచ్ గ్రూపు కంపెనీలకు ఆయన చైర్మన్ ఆరంఘర్ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ విల్లాలో ఉంటారు. గత శుక్రవారం నుంచి ప్రతి రోజూ 1000 నుంచి 1500 మందికి ఆయన అన్నదానం చేస్తున్నారు. అపార్ట్ మెంట్ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా అన్నం, కూరలు, బిర్యానీ వంటివి ఒండిస్తున్నారు. అక్కడే భోజనం ప్యాకెట్లు తయారు చేసి నగరంలోని వివిధ బస్తీల్లో పంపిణీ చేస్తున్నారు. సొంతపల్లెకు తిరుగు వలస పోతున్న పేదలకు కూడా పంచుతున్నారు. ఈ కార్యక్రమంలో స్వయంగా ఆయన పాల్గొంటున్నారు. లాక్ డౌన్ ముగిసే వరకూ ఈ వితరణ కొనసాగిస్తామని సయ్యద్ ఖాజీం అలీ హష్మీ తెలిపారు. 


Updated Date - 2020-04-03T00:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising