ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో ఊళ్లు వదిలి వెళ్లిపోతున్న జనం

ABN, First Publish Date - 2020-04-05T19:04:56+05:30

జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదిలాబాద్: జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రిమ్స్ వైద్యుడు ఒకరు ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు తేలింది. మరోవైపు కరోనా భయంతో పలు గ్రామాల ప్రజలు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. అదిలాబాద్‌కు సంబంధించి నిన్న ఒక్కరోజే 10 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో రిమ్స్ వైద్యుడు చేసిన నిర్వాకం.. వైద్యులపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. రిమ్స్‌లో ఆప్టమాలజీ విభాగం హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ మార్చి రెండో వారంలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లారు. తిరిగి అదిలాబాద్ చేరుకున్న ఆయన యధావిధిగా విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న రిమ్స్ వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు ఆ వైద్యుడిని పరీక్షల నిమిత్తం క్వారంటైన్‌కు తరలించారు.


గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందడంతో నేరేడిగొండ గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆ ముగ్గురు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారే. దీంతో మధుర కాలనీ ప్రజలు వారంతా భయంతో తమ ఇళ్లను ఖాళీ చేసి పంట పొలాల్లోకి వెళ్లిపోయారు. అక్కడ గుడిసెలు వేసుకుని కుటుంబాలతో ఉన్నారు. కరోనా పూర్తి స్థాయిలో పోయిన తర్వాతే గ్రామంలోకి వస్తామని వారు చెబుతున్నారు. 

Updated Date - 2020-04-05T19:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising