ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు ‘టిమ్స్‌’ ప్రారంభం

ABN, First Publish Date - 2020-07-14T00:17:26+05:30

కోవిడ్ బాధితులకు కాస్త ఉపశమనం దొరికింది. కొవిడ్‌ రోగుల కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిని ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కోవిడ్ బాధితులకు కాస్త ఉపశమనం దొరికింది. కొవిడ్‌ రోగుల కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రిని ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభించింది. అయితే ఇక్కడే ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా ఆస్పత్రిని ప్రారంభించారు. గత కొంత కాలంగా ఆస్పత్రి ప్రారంభంపై సందేహాలు వచ్చాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ సోమవారం హఠాత్తుగా ఆస్పత్రిని ప్రారంభించారు. రేపటి నుంచి కోవిడ్ రోగులకు టీమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలిలో నిర్మించిన ఈ ఆస్పత్రిలో 1500 మంది రోగులకు చికిత్స అందించే సామర్ధ్యంతో నిర్మించారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ రిసెర్చి (టిమ్స్)గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇందులో 750 సాధారణ పడకలుంటాయి. మరో 750 మిల్టీ స్పెషాలిటి పడకలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఆస్పత్రిలో 468 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారని అధికారులు చెబుతున్నారు. గచ్చిబౌలిలో 78 ఎకరాల్లో టిమ్స్‌ను నిర్మించారు. 

Updated Date - 2020-07-14T00:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising