ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతులను కుటుంబ సభ్యులు తీసుకెళ్లట్లేదు

ABN, First Publish Date - 2020-08-11T08:42:13+05:30

గాంధీతో పాటు ఆస్పత్రుల్లో కరోనాతో మృతి చెందిన కొందరి మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు రావట్లేదని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది హేయమైన చర్య: వి.శ్రీనివాస్‌ గౌడ్‌ 

పాలమూరు, ఆగస్టు 10: గాంధీతో పాటు ఆస్పత్రుల్లో కరోనాతో మృతి చెందిన కొందరి మృతదేహాలను తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు   ముందుకు రావట్లేదని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఇది హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు.  మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ  చైర్మన్‌ చెరుకుపల్లి రాజేశ్వర్‌ తండ్రి మృతి చెందారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ పీపీఈ కిట్‌ వేసుకొని మృతదేహాన్ని సందర్శించి, అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన కరోనా అంటుకోదన్నారు. కొవిడ్‌ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు వేసుకుని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ సందేశాన్ని అందరికీ తెలపాలనే రాజేశ్వర్‌ తండ్రి అంత్యక్రియలకు తాను హాజరైనట్లు  తెలిపారు. 

Updated Date - 2020-08-11T08:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising