ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై వాట్సాప్‌ చాట్‌ బోట్‌

ABN, First Publish Date - 2020-04-07T09:12:55+05:30

కరోనా మహమ్మారిపై సమరానికి వాట్సాప్‌ కూడా సిద్ధమైంది. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయనుంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వైరస్‌పై ఎప్పటికప్పుడు సమాచారం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిపై సమరానికి వాట్సాప్‌ కూడా సిద్ధమైంది. ప్రజలకు కచ్చితమైన సమాచారం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోనూ కలిసి పనిచేయనుంది. కరోనాపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో వాట్సాప్‌ తన వినియోగదారులకు ప్రత్యేకంగా ‘చాట్‌ బోట్‌’ను తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ దీన్ని ప్రారంభించారు. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ప్రజలంతా ఇంటి వద్దనే ఉండాలని, అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలని చాట్‌బోట్‌ను ఆవిష్కరిస్తూ అన్నారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ మాట్లాడుతూ కరోనాకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే చాట్‌బోట్‌ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు. చాట్‌బోట్‌ సేవలకు +91-90006  58658 నంబరుకి ‘హాయ్‌’/‘హలో’ /‘కొవిడ్‌’ అని ఇంగ్లి్‌షలో సందేశం పంపిస్తే చాట్‌బోట్‌ యాక్టివేట్‌ అవుతుంది.


ఈ సమాచారం తెలుసుకోవచ్చు..   1. కొవిడ్‌-19 ప్రస్తుత పరిస్థితి; 2. కరోనా వైరస్‌ గురించి; 3. ఆరోగ్య కేంద్రాలు/ఐసోలేషన్‌ కేంద్రాలు; 4. ప్రభుత్వ అధికారిక సమాచారం; 5. లాక్‌డౌన్‌ సంబంధిత సమాచారం; 6. వదంతులు, తప్పుడు సమాచార నియంత్రణ; 7. జీహెచ్‌ఎంసీ ఉచిత భోజన కేంద్రాలు; 8. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు; 9. ఇతరులతో పంచుకోండి; 10. తాజా పత్రికా ప్రకటన.

Updated Date - 2020-04-07T09:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising