ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయం దారుణం

ABN, First Publish Date - 2020-12-31T04:24:53+05:30

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేత నిర్ణయం దారుణం

ములుగులో జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న సీతక్క, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ధనసరి సీతక్క

ములుగుటౌన్‌, డిసెంబరు 30: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని ఎమ్మెల్యే ధనసరి సీతక్క విమర్శించారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ ఆఽధ్వర్యంలో ములుగులోని జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కటేననే విషయం తేలిపోయిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటన తర్వాత మాట మార్చిన  కేసీఆర్‌కు రైతులు  తగిన గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించకపోవడమే కాకుండా వారిని మోసగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఎమ్డీ.చాంద్‌పాషా, నాయకులు బానోతు రవిచందర్‌, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్‌, మట్టెవాడ తిరుపతి, షకీల్‌ పాషా, కంబాల రవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T04:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising