ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దుబ్బాక’పై కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం నేడు

ABN, First Publish Date - 2020-10-04T08:16:33+05:30

దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఇందిరాభవన్‌లో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నికలకు సంబంధించి ఇందిరాభవన్‌లో ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని హాథ్ర్‌సలో జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. 


ప్రజలు ఎక్కడికి పోవాలి?: గవర్నర్‌కు దాసోజు ప్రశ్న 

ప్రతిపక్ష పార్టీలు వినతి పత్రాలు ఇవ్వడాన్ని రాజకీయ నాటకంగా గవర్నర్‌ తమిళసై వ్యాఖ్యానించిన వేళ.. ప్రభుత్వం నిరంకుశంగా మారితే ప్రజలు ఎక్కడికి పోవాలంటూ ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌  ట్విటర్‌లో ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ రాజకీయ వేదిక కాదంటూ గవర్నర్‌ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఆంగ్లపత్రిక క్లిప్పింగ్‌ను ఆయన ట్వీట్‌కు జతచేశారు. 


తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌ కవిత కాదు సీతక్క: రాములునాయక్‌  

తెలంగాణ ఫైర్‌ బ్రాండ్‌ మాజీ ఎంపీ కవిత కాదని, ఆ పేరుకు పూర్తి అర్హత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కకే ఉందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు. కరోనా కాలంలో కూడా గిరిజన గూడేల్లో తిరుగుతూ సీతక్క సేవలు చేశారంటూ కొనియాడారు. 

Updated Date - 2020-10-04T08:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising