గ్రేటర్‌లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కొత్త ప్రయోగం
ABN, First Publish Date - 2020-11-13T15:11:44+05:30
హైదరాబాద్: గ్రేటర్‌లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కొత్త ప్రయోగం నిర్వహించనుంది. ఆశావహులకు టీపీసీసీ రుసుము నిబంధన పెట్టింది.
హైదరాబాద్: గ్రేటర్‌లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కొత్త ప్రయోగం నిర్వహించనుంది. ఆశావహులకు టీపీసీసీ రుసుము నిబంధన పెట్టింది. రిజర్వ్డ్ స్థానానికి 5వేలు, జనరల్ స్థానానికి 10వేలు రుసుము చెల్లించాలని వెల్లడించింది. పోటీకి ఆసక్తిగా ఉన్న నేతలు రుసుము చెల్లించి గాంధీభవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. నవంబర్ 18 వరకూ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని వెల్లడించింది. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన డివిజన్లకు సర్వేల ఆధారంగా టీపీసీసీ అభ్యర్థుల ఎంపిక చేయనుంది.
Updated Date - 2020-11-13T15:11:44+05:30 IST