ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరవీరుడు సంతోష్‌బాబుకు అశ్రునివాళి... అంత్యక్రియలు పూర్తి

ABN, First Publish Date - 2020-06-18T17:29:12+05:30

అమరవీరుడు సంతోష్‌బాబుకు అశ్రునివాళి... అంత్యక్రియలు పూర్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు సంతోష్‌బాబుకు యావత్ ప్రజానీకం అశ్రునివాళి అర్పించింది. కల్నల్‌ సంతోష్‌బాబు అంతిమయాత్రలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట సమీపంలోని స్వగ్రామం కేసారంలో సైనిక లాంఛనాలతో కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు నిర్వహించారు. సంతోష్ పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితివద్దకు తీసుకువచ్చారు. పార్థివదేహం చితి చుట్టూ కుటుంబసభ్యులు మూడు సార్లు తిరుగుతున్నారు. వీరజవాన్‌కు నివాళిగా జవాన్లు గాల్లోకి మూడుసార్లు తూటాలు పేల్చి.. గౌరవ వందనం సమర్పించారు. ఆపై  సంతోష్‌బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్‌ చేశారు. కుమారుడు సంతోష్‌బాబు చితికి  తండ్రి ఉపేందర్‌ నిప్పుపెట్టడంతో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.


సంతోష్‌బాబు అంతిమయాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి పళ్లం రాజు, ఎంపీలు బడుగుల లింగయ్య, ఉత్తమ్‌, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైదిరెడ్డి, చిరుమర్తి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-18T17:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising